
సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న కూలీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. అంతేకాకుండా షూటింగ్‌కి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని పోస్ట్ చేసింది. ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ని ఏకంగా రూ.120 కోట్లకి ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు టాక్.