
జనసేన పార్టీ ఏర్పడి 11 ఏళ్లు కావస్తోంది… 2014 మార్చి 14న ఏర్పడిన జనసేన 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసింది.. కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్న జనసేన పార్టీ 2024లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.. పోటీచేసిన 21 స్థానాల్లోనూ, రెండు ఎంపీ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. మార్చి 14వ తేదీన పిఠాపురంలోనే భారీగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి..