
మహిళలు ఆటోలో ప్రయాణించే సందర్భంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే.. శక్తి యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే..ఆ సమాచారాన్ని తల్లిదండ్రులతోపాటు పోలీసులకు పంపించవచ్చు. వేధింపులు, ర్యాగింగ్లు మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి.. వారి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి.. బాధితులను బెదిరించి సొమ్ము చేసుకునే నేరాలు పెరిగిపోయాయి. వీటిపైనా నేరుగా ఈ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. ప్రతీ పాఠశాల, కళాశాలలో పోలీసులు ‘సంకల్పం’ పేరిట ‘డ్రాప్‌బాక్స్’లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు