
ప్రకాష్ రాజ్ : బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌ను తొమ్మిదేళ్ల క్రితం చేశానని, తప్పు తెలుసుకుని తర్వాత యాడ్‌ను ఆపివేయాలని సంస్థను కోరానని తెలిపారు. విజయ్ దేవరకొండ టీం : చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవర కొండ ప్రచారం నిర్వహించాడని ఆయన టీం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దగ్గుబాటి రానా టీం : రానా దగ్గుబాటి స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌కు మాత్రమే ప్రమోట్ చేశారని ఆయన టీం ఓ ప్రకటనలో పేర్కొంది. చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమోదం తెలిపారని చెప్పారు.