
గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలని, ప్రతి జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో పాడేరు మన్యంలోనూ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు.
అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబునాయుడు అల్లూరి జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. మన్యంలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో ఉన్న ఉన్నత విద్యామండలి సెక్రటరీ కోన శశిధర్‌ను సీఎం ఆదేశించారు.