
బీహార్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, జెడియూ కూటమి దారుణంగా ఓటమి పాలవుతుందని.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల లో ఓటమి తర్వాత.. బీజేపీని వీడి, మళ్లీ సీఎం అయ్యేందుకు మరో పార్టీతో జేడీయూ అధినేత నితిశ్ కుమార్ జతకడతారని అన్నారు. గతంలో జేడీయూ నుంచి బహిష్కరణకు గురై స్వయంగా జన సురాజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత కిశోర్ చంపారణ్ జిల్లాలో ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడారు.