
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవిందే కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ వివాహం శుక్రవారం రోజు ఘనంగా జరిగింది. హర్షిత తన స్నేహితుడు సంభవ్ జైన్ చేత తన మెడలో మూడు ముళ్లు వేయించుకున్నారు. ఢిల్లీలోని కుపుర్తలా హౌస్లో జరిగిన వీరి వివాహానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ నేతలు, అతికొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి పుష్ప-2 సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేశారు.