
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్ని టీటీడీ అలర్ట్ చేసింది. మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. టీటీడీ పేరు చెప్పి వేంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో డబ్బు వసూలు చేస్తున్నవారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. శ్రీవారి దర్శనం టికెట్లు కేవలం ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మద్దెల దీపు బాబు పెద్ద మోసగాడు. వేంకటేశ్వరస్వామి దర్శనాల పేరు చెప్పి డబ్బుల్ని వసూలు చేస్తున్నట్లు గుర్తించాము. అతడ్ని నమ్మి ఎవరూ డబ్బులు పంపిచ్చొద్దని కోరింది టీటీడీ..