
ఢిల్లీ విమానాశ్రయంపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఆయన ప్రయాణిస్తోన్న విమానాన్ని జైపూర్‌కు దారి మళ్లించడంపై మండిపడ్డారు. విమానం బయలుదేరిన మూడు గంటల అనంతరం దారి మళ్లించారని, ఢిల్లీ విమానాశ్రయం తీరు దారుణంగా ఉందని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. జైపూర్ నుంచి తిరిగి ఎప్పుడు బయల్దేరుతామో కూడా తెలియదని, దీని గురించి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని దుయ్యబట్టారు.