
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం తర్వాత కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి తాను రాసిన ‘ఆది నుంచి నేటి వరకు’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. చంద్రబాబు నివాసానికి దగ్గుబాటి రావడం సుదీర్ఘ కాలం తర్వాత ఇదే తొలిసారి అంటున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత దగ్గుబాటి చంద్రబాబు ఇంటికి వెళ్లారని చెబుతున్నారు.