
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ, టైలరింగ్ శిక్షణ ప్రారంభిస్తుండగా.. తాజాగా మరో కానుకను అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మహిళా రైడర్ల సేవల్ని ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి మహిళా రైడర్లకు ప్రభుత్వం మార్కాపురంలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ-బైక్లు, ఆటోలు అందజేయనుంది.