
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన మరో కీలకమైన హామీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ‘ఏ జిల్లా మహిళలకు.. ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండలిలో ప్రకటన చేశారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు మాత్రం అనుమతి ఉండదన్నారు.