
టారిఫ్ల గురించి ప్రపంచంలో గందరగోళం చెలరేగిన వేళ శుభ వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై పెంచిన టారిఫ్స్ ను 90 రోజుల పాటు అమలు చేయబోనని ప్రకటించారు. అయితే చైనాపై మాత్రం ఆయన ఒత్తిడి ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రకటన ప్రపంచ దేశాలకు కాస్త ఊరటనిస్తోంది. అమెరికా వస్తువులపై 84% దిగుమతి సుంకం (టారిఫ్) విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా విధానాలు అహంకారపూరితంగా, బెదిరింపు ధోరణిలో ఉన్నాయని విమర్శించిన చైనా.. చివరి వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.