
తెలంగాణలోని కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మరోసారి కలెక్టర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెగ్యులర్ వర్క్ షీట్లు పంపని, క్షేత్రస్థాయి పర్యటనలు చేయని కలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూ భారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, వేసవి తాగునీటి సమస్యలపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.