
నియామక ధోరణులపై లోతైన అధ్యయనం చేసి అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2025 తాజాగా విడుదలైంది. ఇందులో యేటా దాదాపు 83 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, బిజినెస్ స్కూల్ (B-స్కూల్స్) గ్రాడ్యుయేట్లలో 46 శాతం మంది ఎలాంటి ఉద్యోగం పొందడంలేదని వెల్లడించింది. కనీసం ఇంటర్న్‌షిప్ ఛాన్స్ కూడా.. 30 వేలకుపైగా మంది GenZ నిపుణులు, 700 మంది HR నాయకుల ప్రతిస్పందనలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. ఈ సర్వేలో 72% E-స్కూల్స్, 16% B-స్కూల్స్, 12% ఆర్ట్స్, సైన్స్,కామర్స్ కళాశాలలు పాల్గొన్నాయి.