
భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ భారత సైన్యం చూపుతున్న ధైర్య సాహసాలు, జవాన్ల పరాక్రమాలను యావత్ దేశం కీర్తిస్తోంది. దేశం మొత్తం మద్దతుగా నిలుస్తోంది. వారి కోసం పలు రంగాల్లోని ప్రముఖులు ఒక్కొక్కరుగా కదిలి వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీలు, సినీ నిర్మాత అల్లు అరవింద్, హీరో విజయ్ దేవరకొండ ముందుకు వచ్చారు. ఇండోర్‌లోని ట్రక్ ఆపరేటర్లు, రవాణా సంఘాలు భారత సైన్యానికి 7.5 లక్షల ట్రక్కులను ఉచితంగా పంపడానికి ముందుకొచ్చాయి.