
అదానీ గ్రూప్‌తో సహా పలు వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకున్న అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రద్దు చేస్తున్నట్లు వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ తెలిపారు. 2023 సంవత్సరం మొదటి నెలలో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై ఒక నివేదికను ప్రచురించింది. ఈ నివేదికలో అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న కంపెనీలపై అనేక ఆరోపణలు వచ్చాయి. తర్వాత సెబీ విచారణలో కూడా ఏమీ తేలలేదు. హిండెన్‌బర్గ్ నివేదికను గ్రూపును అస్థిరపరిచేందుకు మాత్రమే కాకుండా రాజకీయంగా భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు తీసుకొచ్చారని గౌతమ్ అదానీ అన్నారు.