
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం రోజున టైమ్స్ నౌ సమ్మిట్ 2025 ముగింపు సమావేశానికి హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తామని తాము ఇంతకు ముందే చెప్పామని అన్నారు. అలాగే ఈ పార్లమెంట్ సమావేశంలో తాము వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెడతామని కూడా తెలిపారు. ఇది భారత పార్లమెంటు. పార్టీ కార్యాలయం కాదు, పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ తన పార్టీలో తనకు లభించే ప్రత్యేక హక్కులు పార్లమెంట్లో పొందలేరని గ్రహించాలి’’ అని అమిత్ షా అన్నారు.