
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. టన్నెల్లో సీపేజ్ ఉబికి వస్తోంది. భారీ మోటార్లు ఉపయోగించి డీ వాటరింగ్ చేస్తున్నారు. ప్రమాద స్థలం దగ్గర గాలి లేదు, వెలుతురు అసలే లేదు. ఎయిర్ బ్లోయర్ ధ్వంసం అవడంతో.. పెద్ద స్థాయిలో గాలిని లోపలికి పంపించే పరిస్థితి కనిపించడంలేదు. టన్నెల్లో 12వ కిలోమీటర్ నుంచి 13వ కి.మి. వరకు అంతా గందరగోళ పరిస్థితులున్నాయి. కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం.. మట్టి, నీరు, బురద, సామాగ్రితో ఎలా పనులు సాగించాలో తెలియని స్థితి ఉంది.