ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు , మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు జరగనున్నాయని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం థియరి పరీక్షలకు 40,873 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంకు 41,806 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.అంతేకాకుండా విద్యార్థుల సందేహాల నివృత్తికి ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సందేహాలు ఉంటే నివృత్తి కొరకు కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.