
శుక్రవారం థాయిలాండ్, మయన్మార్‌లో 7.7 తీవ్రతతో కూడిన భూకంపం వచ్చింది. ఈ ధాటికి థాయిలాండ్ , మయన్మార్ దేశాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, మయన్మార్‌లో అధిక సంఖ్యలో చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. భారీ భూకంపంతో అతలాకుతలమైన మాయన్మార్‌కు భారత్ అండగా నిలిచింది. ఆదేశానికి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపనుంది. ఇందులో ఆహార పదార్థాలతో పాటు నిత్యవసర సరుకులు కూడా ఉండనన్నాయి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి IAFC ఎయిర్ క్రాఫ్ట్ లో వీటిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.