
తమిళనాడులో చెలరేగిన హిందీ భాషా వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) దీనిపై తీవ్రంగా స్పందించింది. తమిళనాడు రాజకీయ చరిత్ర గురించి పవన్ కల్యాణ్ అజ్ఞానం బయటపడిందని ఆరోపించింది. “మేము 1938 నుంచి హిందీని వ్యతిరేకిస్తున్నాము. నటుల కాదు, విద్యానిపుణుల సలహాలు, సూచనలతో తమిళనాడు ఎల్లప్పుడూ ద్వి భాషా సూత్రాన్ని అనుసరిస్తుందని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాం.