
కేంద్రం, తమిళనాడు మధ్య హిందీ భాషా లడాయిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. భాషలను ద్వేషించే విధానం పోవాలని ఆకాంక్షించారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటారు… అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దు, హిందీ వద్దు అంటుంటే తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి…కానీ మేం హిందీని ద్వేషిస్తాం అంటే ఇదెక్కడి న్యాయం? ఈ విధానం మారాలి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.