
పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు కోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. స్పీకర్ ఓం బిర్లాను కలిసి అరకు కాఫీ ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ సైతం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించినట్లు రామ్మోహన్నాయుడు స్పీకర్‌కు తెలిపారు.