
టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో జట్టుకట్టింది. దీనిపై ఇరు సంస్థలు నేడు అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో స్టార్‌లింక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించడానికి వీలు పడనున్నది. ఈ సందర్భంగా ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ మాట్లాడుతూ..భారత్‌లో ఎయిర్టెల్ కస్టమర్లకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్పేస్ఎక్స్తో పనిచేయడం ఓ మైలురాయి వంటిదన్నారు. కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి కట్టుబడివుందనడానికి ఈ ఒప్పందం నిదర్శనమన్నారు.