
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)ని రాష్ట్రాలపై ప్రభుత్వం బలవంతంగా రుద్దుతున్నదని, వాటి స్వయంప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నదని మంగళవారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. విద్యా మంత్రిత్వశాఖ పని తీరుపై చర్చలో రితబ్రత బెనర్జీ (టిఎంసి), కనిమోళి, ఎన్‌విఎన్ సోము (డిఎంకె) పాల్గొంటూ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడులో విద్యా కార్యక్రమాలకు ఉద్దేశించిన నిధులను కేంద్రం నిలిపివేస్తున్నదని ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలను ఏమాత్రం సంప్రదించకుండా ఎన్‌ఇపిని రాష్ట్రాలపై రుద్దారు’ అని బెనర్జీ విమర్శించారు.