
ఓ జాతీయ ఛానల్ కాన్క్లేవ్లో ఆయన చాలా అంశాలపై స్పందించారు. తెలంగాణ నమూనాయే దేశానికి నమూనా. 450 ఏళ్లకుపైగా చరిత్ర తెలంగాణ, హైదరాబాద్‌కు ఉంది. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా?సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు కట్టారా.? హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల నుంచే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రులు మారినా అభివృద్ధి కొనసాగింది. హైదరాబాద్ బ్రాండ్‌ను రేవంత్ రెడ్డి ఎక్కడికి తీసుకెళతారో చూడండి అని తెలంగాణ సీఎం అభిప్రాయపడ్డారు.