
ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ షిప్ 8 ప్రయోగించిన కొంత సమాయానికే పేలిపోయింది. గురువారం నాడు స్టార్షిప్ 8 బహామాస్ మీదుగా పేలిపోయింది. ఫిబ్రవరి 6న స్పేస్ఎక్స్ ప్రయోగించిన స్టార్షిప్ రాకెట్ కొన్ని నిమిషాలకే నియంత్రణ కోల్పోయింది. దక్షిణ ఫ్లోరిడా, బహమాస్ సమీపంలో స్టార్ షిప్ పేలిపోయి, శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదం తర్వాత కరేబియన్ ప్రాంతంలో పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని ఫ్లైట్ రాడార్ 24 రిపోర్ట్ చేసింది.