
భారత్ విషయంలో పాక్ ప్రధాని సంచలన సవాల్ స్వీకరించారు. భారత్‌ను తాము ఓడిస్తామని.. ఒకవేళ ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని.. అతి విశ్వాసంతో కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏదో క్రికెట్ మ్యాచ్‌లో కాదు.. ఏకంగా ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో భారత్‌ను పాక్ ఓడిస్తుందని.. తలపొగరు వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. షెహబాజ్ షరీఫ్ పేరు మార్పు ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.