
విపక్ష హోదాపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదన్నారు. ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు . జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి విపక్ష హోదా దక్కేది అన్నారు పవన్ కల్యాణ్. ఈ టర్మ్ ముగిసేవరకు వైసీపీకి ప్రతిపక్షహోదా రాదని కరాఖండిగా చెప్పేశారు ఉప ముఖ్యమంత్రి. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రావాలని హితవు పలికారు పవన్ కల్యాణ్.