
తన కథ ‘జిగుబా’ను కాపీ కొట్టి శంకర్ ‘రోబో’ సినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య చాలా పోలికలున్నాయని న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణ చేపట్టింది. ఇన్వెస్టిగేషన్ లో రచన, దర్శకత్వం చేపట్టినందుకు గాను శంకర్ కు 11 కోట్ల 50 లక్షల పారితోషికం ఈడి తాజాగా అటాచ్ చేసింది. ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది.