నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్దమైంది. వాతావరణానికి సంబంధించిన ప్రతి క్షణం సమాచారాన్ని అందించే వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డిఎస్‌ను ఇస్రో గురువారం ప్రయోగించనుంది.ఈ ఉపగ్రహం సహాయంతో మెరుగైన వాతావరణ సూచన అందుబాటులోకి రావడంతో పాటు విపత్తు హెచ్చరికలకు కూడా ఉపకరిస్తుంది. ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ఫిబ్రవరి 17న ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14 (GSLV F14)లో ప్రయోగించబడుతుంది.