
భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవకుల కోటాను కొత్త అప్లికేషన్ ద్వారా విడుదల చేస్తారు. 45 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వారు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు వీరిని “గ్రూప్ లీడర్స్” అని పిలుస్తారు. వీరు 15 రోజుల, ఒక నెల లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవచ్చు.