
ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం. ఈ సమస్యపై అప్పటి సమాజం పెద్దగా పట్టించుకోలేదు. మన వాతావరణంలో జరిగే మార్పులనూ వివరిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన వంతు ఏమి చెయ్యాలో అందరికీ తెలియ చెప్పడానికి ఒక రోజంటూ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. ఒక వార్తాపత్రిక ద్వారా ప్రజలకూ ఈ ధరిత్రీ దినోత్సవం గూర్చి వివరించారు. 1970 ఏప్రిల్ 22న మొదటి ధరిత్రీ దినోత్సవం జరిగింది.