
టీటీడీ మాజీ ఛైర్మన్ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. గోశాలలో 100 ఆవులు మృతిచెందాయని, గోశాలను గోవధశాలగా మార్చారని భూమన చేసిన వ్యాఖ్యలు గోమాత పట్ల గల గౌరవాన్ని అపహాస్యం చేసినవేనని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు భూమనపై భారత న్యాయసంహిత (BNS) సెక్షన్లు 353(1), 299, 74 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.