
తెలంగాణలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కోరింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి… హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్ కోసం జైకా నుంచి రూ. 11,693 కోట్ల రుణాన్ని కోరినట్లు ప్రభుత్వం తెలిపింది. టోక్యోలోని జైకా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా, సీనియర్ మేనేజర్లు పాల్గొన్నారు.