
సినీ నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిన్ననాటి స్నేహితుడు, చిరకాల ప్రేమికుడైన వేగేశ్న కార్తీక్ తో మూడు ముళ్ళు వేయించుకొని, ఏడడుగులు వేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్లో బుధవారం ఈ వివాహం వైభవంగా జరిగింది. అభినయ భర్త హైదరాబాద్ వాసి. అతనికి పలు వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది. అభినయతో అతనికి 15 సంవత్సరాల నుంచే పరిచయం ఉంది. మాట, వినికిడి శక్తి లేనప్పటికీ తన టాలెంట్‌తో మంచి నటిగా పేరు తెచ్చుకుంది అభినయ. 2008లో ‘నేనింతే’ చిత్రంతో తెరంగేట్రం చేసింది.