
దేశంలో సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారి గాంధీ కుటుంబంపై ఈడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి పేర్లను అందులో చేర్చారు. దీనిపై స్పందించిన హస్తం పార్టీ నేతలు.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా భర్త, బిజినెస్‌మెన్ రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన ఈడీ అధికారులు