
మోడీ ప్రధాని అయ్యేవరకు , అలాగే స్వయంగా మోడీని కలుసుకునేంతవరకు పాదరక్షలు తొడగనని 2009లో ప్రతిజ్ఞ చేసిన హర్యానా లోని కైతాల్ నివాసి అయిన రామ్‌పాల్ కశ్యప్‌కు ప్రధాని మోడీ పాదరక్షలు తొడిగించారు. సోమవారం నాడు ప్రధాని మోడీ హర్యానా పర్యటన సమయంలో ఈ సంఘటన జరిగింది. తన కోసం 14 ఏళ్లుగా పాదరక్షలు లేకుండా నడుస్తున్న వీరాభిమాని కశ్యప్ శపథాన్ని మోడీ నెరవేర్చారు.