
బెంగళూరులోని కేంపెగౌడ ఎయిర్‌పోర్టులో సైన్‌బోర్డులన్నింటి నుంచీ హిందీని తీసేశారు. అక్కడ ఇప్పుడు కన్నడ, ఇంగ్లీషులో మాత్రమే సమాచారం అందిస్తున్నారు. ఈ మార్పునకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా Xలో తెగ వైరల్ అవుతోంది. కొందరు ఈ పనిని మెచ్చుకున్నారు. కానీ చాలామంది ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పని విమర్శిస్తున్నారు. ఒక యూజర్ ఈ మార్పును ప్రశ్నిస్తూ, “ఇంగ్లీషు, కన్నడ తెలిసిన వాళ్ళు మాత్రమే బెంగళూరు వస్తారని అనుకుంటున్నారా? ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో ఉండాలి కదా” అని రాశారు.