
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు పాదరక్షలతో ఆలయ మహాద్వారం వరకు వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా విభాగం వైఫల్యం బహిర్గతమైంది. టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదన పంపారు