
మంచు మోహన్‌బాబు ఇంట్లోని వివాదాలకు ఏమాత్రం ఫుల్స్టాప్ పడడం లేదు. పెదరాయుడి కుటుంబంలో ఫైట్‌కు కాస్తా బ్రేక్ పడిందనుకునేలోపే.. మళ్లీ వైలెంట్ సీన్లు దర్శనమిస్తున్నాయి. తాను ఇంట్లో లేనప్పుడు కారుతోపాటు కాస్ట్లీ వస్తువులను విష్ణు ఎత్తుకెళ్లారని నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు మంచు మనోజ్. జల్పల్లిలోని ఇంటిలోకి 150మంది వ్యక్తులు చొరబడి విలువైన వస్తువులను తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లోని కార్లన్నీ.. విష్ణు ఆఫీసులో ఉన్నాయంటూ వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అప్పగించారు.