
ఆర్థిక సంవత్సరం 2024-25లో మార్చి 31 నాటికి భారతదేశంలో 9.19 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 7 శాతం పెరుగుదల నమోదైంది. మహారాష్ట్రలో అత్యధికంగా రిటర్న్‌లు ఫైల్ కాగా, రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారే అధిక సంఖ్యలో ఉన్నారు. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 3.24 లక్షల మంది కూడా రిటర్న్‌లు దాఖలు చేశారు.