
అశోక్ ఖేమ్కా 1991 బ్యాచ్ హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి. ఖేమ్కా ఐఏఎస్ అధికారిగా తన నిజాయితీ, అవినీతిపై పోరాటం, అసాధారణమైన కెరీర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఖేమ్కా తన 34 సంవత్సరాల కెరీర్‌లో 57 సార్లు బదిలీ అయ్యారు. ఇది హర్యానా రాష్ట్రంలో ఒక రికార్డు. సగటున ప్రతి ఆరు నెలలకు ఒకసారి బదిలీ అయ్యారు. అవినీతిని వ్యతిరేకించడం, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకపోవడం, పవర్‌ఫుల్ వ్యక్తుల లాండ్ డీల్‌లలో అక్రమాలను బయటపెట్టడం వల్ల జరిగాయి