loader

ఎమ్మెల్సీ అనంతబాబు నోటి దురుసు

‘వాడెవడు.. వాడి పెత్తనం ఏమిటిక్కడ?’.. అంటూ అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆలయ పీఆర్ఓను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్షింతలు ఇవ్వలేదని కళ్యాణ వేదిక వద్దే ఉండిపోయారని సమాచారం. ముఖ్యఅతిథులు వెళ్లిపోయినా అక్కడే ఉండి తనకు అక్షింతలు ఇవ్వాలని పట్టుబట్టారట. ఈవో సుబ్బారావును రప్పించి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజువల్స్ బయటికి వచ్చాయి.

తిరుమలలో హై సెక్యూరిటీ.. కొండపై ‘ఏరియా డామినేషన్’

ఏపీలో కూడా భారతదేశం, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం ఎఫెక్ట్ కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుమలలో సెక్యూరిటీని పెంచారు.. కొండపై ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, నిఘా మరియు భద్రత విభాగం, బాంబ్,  స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించి తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ […]

కంటెంట్‌ తొలగించాలని ఆదేశించడం కోర్టుల విధి కాదు : సుప్రీంకోర్టు

బహిరంగ చర్చలు, నిష్పాక్షికతలను పణంగా పెట్టి, ఎటువంటి కారణం లేకుండా, మీడియా రిపోర్టింగ్‌ను తొలగించాలని ఆదేశించడం కోర్టుల విధి కాదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. ఏఎన్‌ఐ వార్తా సంస్థకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. వికీమీడియా ఫౌండేషన్‌పై ఏఎన్‌ఐ దాఖలు చేసిన పరువు నష్టం దావా వివరాలను వికీపీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పేజ్‌ను తొలగించాలని వికీమీడియా ఫౌండేషన్‌ను గతంలో హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఆపరేషన్ సింధూర్‌కు అండగా కదులుతున్న యావత్ భారతావని.. సైన్యానికి ఉడతాభక్తిగా సాయం!

భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ భారత సైన్యం చూపుతున్న ధైర్య సాహసాలు, జవాన్ల పరాక్రమాలను యావత్ దేశం కీర్తిస్తోంది. దేశం మొత్తం మద్దతుగా నిలుస్తోంది. వారి కోసం పలు రంగాల్లోని ప్రముఖులు ఒక్కొక్కరుగా కదిలి వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి,కాంగ్రెస్ ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీలు, సినీ నిర్మాత అల్లు అర‌వింద్, హీరో విజయ్ దేవరకొండ ముందుకు వ‌చ్చారు.  ఇండోర్‌లోని ట్రక్ ఆపరేటర్లు, రవాణా సంఘాలు భారత సైన్యానికి 7.5 లక్షల ట్రక్కులను ఉచితంగా పంపడానికి ముందుకొచ్చాయి.

పాకిస్థాన్ కు రూ.7,500 కోట్లు సాయం చేసిన IMF..

భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) సంస్థ ఏకంగా 1 బిలియన్ యూఎస్ డాలర్లు సాయం ప్రకటించింది. అంటే రూ. 7,500 కోట్లు అని అర్థం. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. అయితే IMF తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ మండిపడింది. పాకిస్థాన్.. ఆ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ముందు లేవనెత్తింది.

పాకిస్థాన్‌కు మద్దతుపై చైనా యూటర్న్‌

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న వేళ చైనా తన వైఖరిపై మాట మార్చింది. ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.. శాంతి, సుస్థిరతకు సంబంధించిన విశాల ప్రయోజనాల కోసం భారత్‌, పాక్‌ ప్రశాంతంగా ఉండాలని సూచించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు అంతర్జాతీయ సమాజంతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ స్పష్టం చేసినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. పాక్ ఆర్మీపై తెహ్రీక్-ఇ-తాలిబన్ దాడి. 10 మంది మృతి

తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) మరోసారి పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంది. టీటీపీ తన స్నిపర్లు అనేక మంది పాకిస్తానీ సైనికులపై మెరుపుదాడి చేస్తున్నట్లు ఒక వీడియోను విడుదల చేసింది. టీటీపీ యోధులు జరిపిన కాల్పుల్లో 10 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని పేర్కొంది. ఈ ఆపరేషన్ ద్వారా, పాకిస్తాన్ సైన్యం, భద్రతా సంస్థలు, వారి మిత్రదేశాలపై దాడులు జరుగుతాయి. పాకిస్తాన్ సైన్యం గత 77 సంవత్సరాలుగా దేశాన్ని నాశనం చేస్తోందని, దానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తుందని […]

సెలవులన్నీ క్యాన్సిల్.. అందరూ పనిచేయాల్సిందే. కేంద్రం ఆదేశాలు

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం అన్ని ఆరోగ్య శాఖ అధికారుల సెలవులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేసింది. “ఉన్న పరిస్థితుల దృష్ట్యా, వైద్య కారణాలతో తప్ప, ఏ అధికారికీ ఎలాంటి సెలవులు మంజూరు చేయవని పేర్కొంది. ఇప్పటికే మంజూరు చేసిన సెలవులు కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెలవులో ఉన్న అధికారులు వెంటనే విధుల్లో చేరాలి” అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న 56 మంది తమిళ విద్యార్థులు.. రంగంలోకి స్టాలిన్ సర్కార్..!

తమిళనాడుకు చెందిన 56 మంది విద్యార్థులు జమ్ము కశ్మీర్‌లో చిక్కుకుపోయారు. తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ము కశ్మీర్‌లోని పలు విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇటీవలే తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు విజ్ఞాన యాత్ర కోసం జమ్ము కశ్మీర్ వెళ్లారు. దీంతో అప్రమత్తమైన తమిళనాడు సర్కారు వారిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే విమాన సర్వీసులు నిలిచిపోవడంంతో.. 56 మంది విద్యార్థులను రోడ్డు మార్గంలో తిరిగి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు […]

ఏపీకి కేంద్రం శుభవార్త.. విశాఖపట్నంవారికి పండగే

ఆంధ్రప్రదేశ్‌ రోడ్లపై కొత్త విద్యుత్ బస్సులు పరుగులు తీయనున్నాయి.. కేంద్రం ఏపీఎస్ ఆర్టీసీకి 750 బస్సుల్ని పంపిస్తుందని తెలిపారు అధికారులు. ఈ బస్సుల్ని ఏపీలోని వివిధ నగరాలకు రానున్నాయి.. విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం, తిరుపతి, మంగళగిరికి బస్సుల్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. విశాఖ నగరానికి నాలుగు విడతల్లో మొత్తం 200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. మొదటి విడతలో 50 బస్సులు త్వరలో వస్తున్నట్లు చెబుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON