ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్!
నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్‌లో అర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణ పనులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు సహకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.లేటెస్ట్‌గా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్స్‌కు క్యాప్టివ్ పోర్ట్ కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొదటి దశలో రూ.55,964 కోట్ల పెట్టుబడితో ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నిర్మించనున్నారు.