loader

మెగాస్టార్ చిరంజీవి కి అరుదైన గౌరవం

హౌస్ ఆఫ్ కామ‌న్స్ – యు.కె పార్ల‌మెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కి  గౌరవ స‌త్కారం జరగనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యుకె కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19న స‌న్మానించ‌నున్నారు.బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా, ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.

తమిళనాడు, కేంద్రం మధ్య కొనసాగుతోన్న వివాదం

స్ఠాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ లోగోలో ‘₹’ చిహ్నాన్ని తొలగించింది. దాని స్థానంలో తమిళంలో ‘రూ’ అనే అక్షరానికి చోటు కల్పించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. ఇది భారత ఐక్యతను దెబ్బతీసే వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించడమేనని ఆరోపించారు. అధికారికంగా 2010లో కేంద్రం ఆమోదించిన సమయంలో డీఎంకే ఎందుకు వ్యతిరేకించలేదని ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఆమె నిలదీశారు. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామ్యపక్షంగా ఉన్న విషయాన్ని కేంద్ర […]

స్పేడెక్స్‌ శాటిలైట్ల డీ-డాకింగ్‌ విజయవంతం

స్పేడెక్స్‌ శాటిలైట్ల డీ-డాకింగ్‌(విడదీత) గురువారం విజయవంతంగా జరిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. దీని ద్వారా చంద్రుడిపై భవిష్యత్తు పరిశోధనలకు(చంద్రయాన్‌-4), మానవ సహి త వ్యోమనౌక ప్రయోగానికి, సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని ఆయన తెలిపారు. తాజా డీ డాకింగ్‌ ద్వారా వృత్తాకార కక్ష్యలో డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ను విజయవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని తాము సంపాదించామని భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ఇస్రో) తెలిపింది.

దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశానికి హాజరుకానున్న కేటీఆర్‌

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో మార్చి 22న చెన్నైలో నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల సంయుక్త సమావేశానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ఇప్పుడు ప్రాతినిధ్యం తగ్గించేందుకు ప్రయత్నించడం అన్యాయమని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడితే తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు.

శనివారం నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవి కాలం నేపథ్యంలో శనివారం(మార్చి 15) నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. విద్యాసంవత్సరం ముగిసే వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు పని చేయనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇవి […]

ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎండలు తప్పవు..

ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుండగా.. పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలు దాటేశాయి. వేసవి మండుతోంది ముఖ్యంగా భారత వాతావరణ శాఖ మార్చి మే మధ్య నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది . ఈ నేపథ్యంలో భారత దేశంలో హీట్ వేవ్స్ ఉండే అవకాశం ఉందని పేర్కొంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON