loader

జియో- స్టార్‌లింక్ ఒప్పందం..

జియో ప్లాట్‌ఫామ్స్, స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని, భారత్‌లో స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది. భారతదేశంలోని తన కస్టమర్లకు స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్పేస్‌ఎక్స్‌తో ఒక ఒప్పందాన్ని ప్రకటించింది. ఇది భారతి ఎయిర్‌టెల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తరువాత జరిగిన పరిణామం. ఈ ఒప్పందం, స్పేస్‌ఎక్స్ ఇండియాలో స్టార్‌లింక్‌ను అమ్మేందుకు అవసరమైన అనుమతులు పొందే ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.

అరకు కాఫీ త్వరలో పార్లమెంట్‌లో. . .!

పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు కోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా.. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి అరకు కాఫీ ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ సైతం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించినట్లు రామ్మోహన్‌నాయుడు స్పీకర్‌కు తెలిపారు.

SpaceX తో ఎయిర్‌టెల్‌ జట్టు

టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్‌ తన కస్టమర్లకు వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలకోసం ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో జట్టుకట్టింది. దీనిపై ఇరు సంస్థలు నేడు అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో స్టార్‌లింక్స్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించడానికి వీలు పడనున్నది. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌ మాట్లాడుతూ..భారత్‌లో ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు స్పేస్‌ఎక్స్‌తో పనిచేయడం ఓ మైలురాయి వంటిదన్నారు. కస్టమర్లకు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు అందించడానికి కట్టుబడివుందనడానికి ఈ ఒప్పందం […]

రాష్ట్రాలపై ఎన్‌ఇపిని రుద్దుతున్నారు

జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)ని రాష్ట్రాలపై ప్రభుత్వం బలవంతంగా రుద్దుతున్నదని, వాటి స్వయంప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నదని మంగళవారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. విద్యా మంత్రిత్వశాఖ పని తీరుపై చర్చలో రితబ్రత బెనర్జీ (టిఎంసి), కనిమోళి, ఎన్‌విఎన్ సోము (డిఎంకె) పాల్గొంటూ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడులో విద్యా కార్యక్రమాలకు ఉద్దేశించిన నిధులను కేంద్రం నిలిపివేస్తున్నదని ఆరోపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలను ఏమాత్రం సంప్రదించకుండా ఎన్‌ఇపిని రాష్ట్రాలపై రుద్దారు’ అని బెనర్జీ విమర్శించారు.

పసుపు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు

పసుపు రైతులు ఎవరు నష్టపోకుండా వారి పంటను కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ నామ్ పోర్టల్‌లో పసుపు పంటకు వచ్చే గరిష్ట ధరను ఆధారంగా చేసుకుని, నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రైతుల చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను రాజేంద్రనగర్ పరిశోధన స్థానం నుండి శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా వివరించారు.

విలువలతో కూడిన జర్నలిజం అవసరం

ిలువలతో కూడిన జర్నలిజం అవసరం ఉన్నదని ఐజెయు మాజీ అధ్యక్షుడు, ఎడిటర్ దేవుల పల్లి అమర్ అన్నారు. జర్నలిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ద్వితీయ మహాసభ మంగళవారం నిర్వహించారు. జాతీయ కార్యదర్శి నరేందర్‌రెడ్డి మాట్లాడు తూ ఇటీవలి కాలంలో జర్నలిజంలో చోటు చేసుకున్న సంఘటనలు బాధాకరమన్నారు. జర్నలిస్టులు ప్రజల గొంతుకలుగా పనిచేయాలన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON