ఉమెన్స్ డే సందర్భంగా ఆసక్తికర విషయం బయటపెట్టిన ప్రధాని మోదీ!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎల్లప్పుడూ బిజీగా ఉండే ప్రధాని, ప్రతి సంఘటనకు తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తారు. ఈ విషయంలో మహిళల పాత్రను ప్రధాని ప్రశంసించారు. మహిళా సాధికారతకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.