loader

వైట్‌హౌస్‌లో ట్రంప్‌-జెలెన్‌స్కీ ఘర్షణ..

ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి సంబంధించి.. వైట్‌హౌస్‌లో శాంతి చర్చల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘర్షణతో ఉక్రెయిన్ రాయబారి తలపట్టున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతి చర్చలు కాస్తా.. అసంపూర్తిగా ముగియడంతో ఎలాంటి ఒప్పందాలు లేకుండానే వైట్‌హౌస్ నుంచి జెలెన్‌స్కీ వెళ్లిపోయారు. ఈ సమావేశం అర్ధాంతరంగా ముగిసిపోయింది.

ఆధార్ కార్డు లేకపోయినా సేవలు..: తెలంగాణ ప్రభుత్వం

ఆధార్ కార్డు లేకపోయినా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఆధార్ లేకపోతే వైద్యం చేయడంలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం ప్రభుత్వ స్పందనను అడిగింది. ఉస్మానియాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా ఆధార్ లేకున్నా వైద్యం అందిస్తామని చెప్పింది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని ప్రభుత్వ లాయర్ స్పష్టం చేశారు.

ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం..

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.  సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని ఈరోజు (మార్చి 1) సాయంత్రం నుంచి ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెట్టారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో ‘జీ తెలుగు’ టెలివిజన్ ఛానల్ లోనూ టెలికాస్ట్ చేసారు

మార్చి 2న తొలి ఉపవాసం, రంజాన్ పవిత్రమాసం ప్రారంభం

ఇస్లాం పవిత్ర మాసం రంజాన్ చంద్రుడు శుక్రవారం ఢిల్లీతో సహా దేశంలోని ఏ ప్రాంతంలోనూ కనిపించలేదు. మొదటి ఉపవాసం మార్చి 2 (ఆదివారం)న ఉంటుంది. చాందినీ చౌక్‌లోని ఫతేపురి మసీదుకు చెందిన షాహి ఇమామ్ మౌలానా ముఫ్తీ ముకర్రం అహ్మద్ మాట్లాడుతూ, గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సాధారణంగా చంద్రుడు కనిపిస్తాడని కానీ అక్కడి నుండి రంజాన్ చంద్రుడిని చూసినట్లు ఎటువంటి వార్తలు లేవని అహ్మద్ అన్నారు. అందుకే మొదటి ఉపవాసం మార్చి 2న అంటే ఆదివారం ఉండాలని […]

AI లో ఎలాన్ మస్క్ కే సవాల్ విసురుతున్న ఐఐటియన్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు (Elon Musk) కే ఛాలెంజ్ విసిరిన భారతీయ ఐఐటీయన్ అరవింద్ శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) నుంచి ఫండింగ్ తెచ్చుకోకుండా నన్ను ఆపు అని ఏకంగా ఎలాన్ మస్క్‌కు సవాల్ విసిరాడు అరవింద్ శ్రీనివాస్. గూగుల్, OpenAI లాంటి పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేసిన ఈ కుర్రాడు ఇప్పుడు Perplexity AI ని స్థాపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON